నవతెలంగాణ-రామారెడ్డి
అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ భారత్ నుండి ఎగుమతి దిగుమతులకు 50 శాతం సుంకం విధించడాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా సిపిఐ కార్యదర్శి ధశరత్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బిజెపి ప్రభుత్వం లేబర్ చట్టం 44 ను రద్దుచేసి 8 గంటల పని వేళలను 12 గంటలకు పెంచడం సరైనది కాదని హెచ్చరించారు. భారతదేశాన్ని కొల్లగొట్టే ప్రయత్నం డోనాల్డ్ ట్రంప్ విరమించుకోవాలని హెచ్చరించారు. భారత్ రష్యా నుండి ఆయిల్ దిగుమతిని జీర్ణించుకోలేక అమెరికా ఇలాంటి కవ్వింపుకు చర్యలకు దిగడం సరైనది కాదని అన్నారు. నరేంద్ర మోడీ ప్రపంచ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉందని ప్రచారం చేస్తున్న, 50 శాతం అమెరికా విధిస్తున్న సుంకం ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి బాలరాజు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకులు హైదర్, రాజేందర్, సుకృద్దీన్, బడా హైదర్, రాములు, శ్రీనివాస్, జలాల్ తదితరులు ఉన్నారు.
50% సుంకాలను అమెరికా రద్దు చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES