2300కి పైగా కేసులు నమోదు
ఖార్టూమ్ : సూడాన్‌లో కలరా కలకలం రేపుతోంది. గత వారంలో సూడాన్‌లోని పశ్చిమ డార్ఫర్ ప్రాంతంలో 2300కి పైగా కలరా కేసులు నమోదవగా, 40మంది మరణించారు. డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఎంఎస్‌ఎఫ్) గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. సూడాన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి తోడు సూడాన్ ప్రజలు పెచ్చరిల్లిన కలరాతో అత్యంత భయంకరమైన, అధ్వాన్నమైన పరిస్థితులను అనుభవిస్తున్నారని ఎంఎస్‌ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. బాధిత ప్రాంతాల్లో కలరా వ్యాక్సిన్ వేస్తున్నారని పేర్కొంది. సూడాన్‌లోని అన్ని రాష్ట్రాల్లో 132 లోకాలిటీల వ్యాప్తంగా 99,756 కేసులు నమోదవగా, 2475 మరణాలు సంభవించాయని సూడాన్ ఆరోగ్య శాఖ వర్గాలు బుధవారం తెలిపాయి. ముఖ్యంగా నిర్వాసితులైన ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఈ వ్యాధి బాగా ప్రబలుతోంది. ఆ ప్రాంతాల్లో పరిశుభ్రమైన తాగునీరు కొరవడడం, పారిశుధ్య సేవలు లేకపోవడం ఈ వ్యాధి పెచ్చరిల్లడానికి కారణమవుతున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. దేశంలోజరుగుతున పోరు నుండి తప్పించుకునేందుకు ప్రజలు అటూ ఇటూ తిరుగుతుండడంతో కలరా కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆ ప్రకటన పేర్కొంది. సూడాన్, పొరుగున గల చాద్, దక్షిణ సూడాన్‌లకు పాకుతోంది. 2023 ఏప్రిల్ నుండి సూడాన్‌లో తీవ్ర స్థాయిలో సూడాన్ సాయుధ బలగాలకు, పారామిలటరీ రాపిడ్ సపోర్ట్ బలగాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
సూడాన్‌లో కలరా కాటుకు 40మంది మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES