Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుయూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు 

యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు 

- Advertisement -
  • హైవేపై గంటపాటు నిలిచిన వాహనాలు
    నవతెలంగాణ – దుబ్బాక 
    వర్షాలు కురుస్తున్న వరి నాట్లు జోరందుకున్నాయి. పంటలకు దన్నుగా నిలిచే యూరియా బస్తాల కోసం అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు సరిపడేంత మోతాదులో యూరియా బస్తాలను అందించడం లేదంటూ వ్యవసాయ శాఖ అధికారులపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తగినంత యూరియాను అందించాలని డిమాండ్ చేస్తూ పలువురు రైతులు గురువారం దుబ్బాక మండలం హబ్సిపూర్ చౌరస్తా వద్ద ఎల్కతుర్తి నేషనల్ హైవే 765 డీజీ పై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ నేపధ్యంలో దుబ్బాకలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్యూ లైన్ లలో నిలబడ్డావారికి, టోకెన్లు తీసుకున్నవారికి యూరియా బస్తాలు ఇవ్వడం లేదంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆశించినంత మేర యూరియాను సప్లై చేయడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు గంటపాటు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న దుబ్బాక సీఐ పీ.శ్రీనివాస్ ఎస్ఐ కీర్తిరాజుతో కలిసి ఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తామని రైతులను సముదాయించారు. దీంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా యూరియా ఒకరికి రెండు బస్తాల చొప్పున రైతులకు అందజేస్తున్నట్లు, ఇప్పటివరకు 3360 బస్తాల యూరియాను సరఫరా చేయడం జరిగిందని పీఏసీఎస్ చైర్మన్ షేర్ల కైలాష్ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad