Sunday, May 4, 2025
Homeరిపోర్టర్స్ డైరీసిల్లీ పాయింట్‌

సిల్లీ పాయింట్‌

- Advertisement -

అప్పుడు… డబుల్‌ బెడ్‌రూంలు ఇయ్యలే. దళితుడు ముఖ్యమంత్రి కాలే. దళితబంధు రాలే. మూడెకరాల భూమి దక్కలే. వరదొచ్చిన ఇంటికి రూ.10వేలు రాలే. హుస్సేన్‌సాగర్‌లో కొబ్బరినీళ్లు పారలే.
ఇప్పుడు… మహాలక్ష్ములకు ప్రతినెలా రూ.2,500 రాలే. కౌలు రైతులకు ఏడాదికి రూ.12వేలు లేవు. రైతు బంధు సొమ్ము పెరగలే. 57 ఏండ్లకు ఫించన్‌ రాకపాయే. ఆడబిడ్డ పెండ్లికి తులం బంగారం అటకెక్కే.
సీట్లో కూసుంటే సాలు, దానికోసం ఎన్ని గప్పాలైనా కొట్టొచ్చు. ఎన్ని తుంటరి మాటలైన సెప్పొచ్చు. సెప్పేటోడు శ్రీరామసెంద్రుడైతే, వినేటోడు వెర్రి వెంగళప్ప అంట! ‘సమైక్య పాలకులు’ అనే కామన్‌ డైలాగ్‌తో ఆ పదేండ్లు గడిచిపాయే. ఆ తర్వాత మూడు రంగుల జెండా పట్టినాయన ఆదే సీట్లో కూసుని ‘అప్పుల కుప్ప, వయ్యారి భామ’ అని వల్లేస్తూ, ‘అంతా మీవల్లే’ అంటూనే, ‘ప్లీజ్‌ అర్థం చేసుకోండి’ అని బతిమాలబట్టే! పైగా, వచ్చేది రూ.18వేల కోట్లు. కట్టాల్సింది రూ.22 వేల కోట్లు అంటూ అంకెల లంకెల్ని లగాయించి చెప్పబట్టే! అంటే సివరాఖరికి సన్నాయి నొక్కులు సామాన్యులకేనా! దొందూ దొందే అంటే ఇదేనా యువరానర్‌! సల్లంగుండలే…సామీ…మీరు హాయిగుండాలే…మేలుకో మహారాజా మేలుకో…మేలుకొని మమ్మేలుకో!!

  • ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -