- Advertisement -
నవతెలంగాణ-బోడుప్పల్ : దేశ స్వాతంత్ర్యం అనేక త్యాగాల ఫలితమని, ఆ ఫలాలను ప్రతి పౌరుడు సమానంగా అనుభవించేందుకు అందరం కృషి చేయాలని బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పిలుపునిచ్చారు.79వ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు బోడుప్పల్ కార్పొరేషన్ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్పొరేషన్ కమిషనర్ ఏ. శైలజ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ మేయర్ అజయ్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు.అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛ ఫలాలను ఆస్వాదించేలా సమాజంలో సమానత్వం, ఐక్యత పెంపొందించుకోవాలన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు.
- Advertisement -