నవతెలంగాణ-బోడుప్పల్ : సమాజ నిర్మాణంలో పాత్రికేయుల పాత్ర కీలకమని మేడిపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిర్ర శ్రీధర్ రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ప్రెస్ క్లబ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ భక్తిగీతాల నడుమ వందనం చేశారు.ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారు కల్కూరి ఎల్లయ్య మాట్లాడుతూ, “సమాజ నిర్మాణంలో మీడియా పాత్ర అమూల్యం. పత్రికా విలువలను కాపాడుతూ జర్నలిస్టులు పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి” అని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో కార్యదర్శి వడెమాను సుందర్, కోశాధికారి మరాటి మల్లేష్, ఉపాధ్యక్షుడు చింత రమేష్, సంయుక్త కార్యదర్శులు చిన్నం మధు, నిరుడు అంజన్ కుమార్, సభ్యులు ఎన్. రాము యాదవ్, వంగ శ్రీనివాస్ రెడ్డి, బుష గణేష్, శేరి కరుణాకర్ రెడ్డి, జంగా నరేందర్ యాదవ్, బైరెడ్డి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Independence day : మేడిపల్లి ప్రెస్ క్లబ్ లో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES