Sunday, May 4, 2025
Homeజాతీయంమధ్యప్రదేశ్‌లో ఘోరం

మధ్యప్రదేశ్‌లో ఘోరం

- Advertisement -

– యువతిపై సామూహిక లైంగికదాడి
– రెండ్రోజులపాటు దారుణానికి ఒడిగట్టిన ఆరుగురు
భోపాల్‌:
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకున్నది. 17 ఏండ్ల అమ్మాయిపై ఆరుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. సామూహిక లైంగికదాడికి తెగబడ్డారు. రెండ్రోజులపాటు ఆ అమ్మాయిపై ఈ పాశవిక చర్యను జరిపారు. ఈ దారుణం తర్వాత రాత్రి సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న బాధితురాలిని ఒక డిప్యూటీ జైలర్‌ ఒక హౌటల్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడి నుంచి ఆమెను రక్షించారు. షాడోల్‌ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఆరుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. షాడోల్‌లోని బుధర్‌ సబ్‌-జైలులో పని చేస్తున్న డిప్యూటీ జైలర్‌ వికాస్‌ సింగ్‌ పాత్రపై అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన.. మైనర్‌ను అపహరించిన అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉన్నది. మాండ్లాలోని ఒక ఇంట్లో బందీగా ఉంచబడిన ఏడో తరగతి బాలికలను ఇద్దరు వ్యక్తులు మూడ్రోజుల పాటు సామూహిక లైంగికదాడికి తెగబడిన ఘటన బయటకు వచ్చిన ఒక రోజు తర్వాత ఈ దారుణం చోటు చేసుకోవటం గమనార్హం. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. బాధితురాలు ఏప్రిల్‌ 28న కనబడకుండా పోయింది. దీంతో బాధితురాలి కుటుంబం షాడోల్‌లోని సోహగ్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెకోసం వెతకటం ప్రారంభించారు. మరుసటి రోజు ఆమెను ఒక హౌటల్‌లో కనుగొన్నారు. గురువారం సాయంత్రం నాటికి పోలీసులు నలుగురు అనుమానితులను అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ”ఈ నెల 29న ఒక వ్యక్తి బాధితురాలిని నిర్మానుశ్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆయన, మరో ఇద్దరు ఆమెపై లైంగికదాడికి తెగబడ్డారు. మరుసటిరోజు, మరొక నిందితుడు ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడ ఆయనతో పాటు మరో ఇద్దరు దారుణానికి ఒడిట్టారు” అని సోహగ్‌పూర్‌ పోలీసు అధికారి భూపేంద్ర మండి పాండే తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం.. ఏప్రిల్‌ 30న రాత్రి షాడోల్‌ రైల్వే స్టేషన్‌ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. డిప్యూటీ జైలర్‌ వికాస్‌ సింగ్‌ ఆమెకు లిఫ్ట్‌ ఇచ్చాడు. ఆయన ఆమెను ఒక హౌటల్‌కు తీసుకెళ్లాడు. మే 1న పోలీసులు ఆమెను అక్కడ కనుగొన్నారు. కాగా, అదే హౌటల్‌లో ముందురోజే డిప్యూటీ జైలర్‌కు నిశ్చితార్ధం జరిగింది. బాలికను అక్కడికి తీసుకొచ్చినపుడు ఆయన బంధువులు అప్పటికీ అక్కడే ఉన్నారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు ఆందోళనను వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపించాయి. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -