ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని కల్కి నగర్ నాలుగో వీధిలో సీసీరోడ్లు లేక ఇబ్బందుల గురవుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు తమ కాలనీకి వచ్చి ఒకసారి చూడాలని కోరుతున్నామన్నారు. తమ కాలనీలో సిసి రోడ్డు లేక ఉన్న రోడ్డుపై మొరం వేయలేదని, డ్రైనేజీలు లేక గడ్డి పెరిగి భయంకరంగా మారిందని తెలిపారు. దీంతో ఇక్కడ వర్షాకాలంలో పాములు, తేళ్లు ఇండ్లలోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డిలో మున్సిపల్ ఉందా ఉంటే కౌన్సిలర్లు గతంలో ఉన్నారా లేరా అని అనుమానాలు కలుగుతున్నాయి అన్నారు.
ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా మునిసిపల్ అధికారులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధికారులను కోరుతున్నామన్నారు. మున్సిపల్ పరిధిలోని కల్కి నగర్, 4వ వీధి కాలనీ వాసులు జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ బి. విట్టల్ ముదిరాజ్, నర్సింలు, రావిరెడ్డి, చంద్రం, కాషాగౌడ్, రాజు, వడ్ల భూమయ్య నారాయణరావు హరి సెట్ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలతో రోడ్లన్నీ జలమయం ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES