నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద గుల్లా ఎంపీయూపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, ఉర్దు మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమీనా బేగం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆటల పోటీల కార్యక్రమాలు, విద్యార్థులతో పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆటపోటిలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. విద్యార్థిని విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా పంద్రాగస్టు వేడుకల కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలను విద్యార్థులకు రుచికరమైన మిఠాయిలు , భోజనాలు ఏర్పాటు చేశారు. అంతకుముందు గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం చంద్రకళ, ఉర్దూ మీడియం హెచ్ఎం షమీనా బేగం, రాజు, దివ్య, లక్ష్మణ్ , షేక్ , గుప్తా విద్యార్థిని , విద్యార్థులు , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీపీఎస్, ఉర్దు మీడియం పాఠశాలలో పంద్రాగస్టు వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES