నవతెలంగాణ – జుక్కల్
దోస్త్ పల్లి ప్రాథమిక పాఠశాలలో 79వ పంద్రాగస్టు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయుడు వి.శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ .. కేవలం పాఠశాలలో చదివే విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు కొద్దిమంది గ్రామ పెద్దలతో మాత్రమే జరుపుకునే వేడుక కాదని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం అనేది జాతీయ పండుగ కాబట్టి గ్రామంలోని ప్రతి ఒక్కరు పాఠశాలలో నిర్వహించే వేడుకలకు హాజరయ్యి విజయవంతం చెయ్యాలని తెలిపారు. అంతకు ముందు రోజు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిలుపునివ్వడంతో గ్రామంలోని ప్రజలు, పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరుయ్యారు.
అదేవిధంగా బ్రిటిష్ వారి పాలన, దానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య ఉద్యమాలు, ఆ ఉద్యమాల్లో ప్రాణాలు త్యాగం చేసిన స్వాతంత్ర సమర యోధుల గురించి వివరించి, మనకు స్వతంత్ర ఇచ్చి వెళ్లిన మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ గొప్పగా ఎదగాలని విద్యార్థులకు సూచించటం జరిగింది. అలాగే పిల్లలతో డాన్స్, ఉపన్యాసం, తెలుగు, ఇంగ్లీష్ రైమ్స్ పాడించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ పెద్దలకు పాండురంగ పటేల్, నాందేవ్ పటేల్, దత్తు పటేల్, ఇతర గ్రామ పెద్దలకు పాఠశాల తరపున ప్రధానోపాధ్యాయులు వి. శంకర్ సన్మానం చేయడం జరిగింది. పాఠశాల విద్యార్థులకు, ప్రజలకు పులిహోర, స్వీట్స్ అందించారు.
దోస్త్ పల్లి పాఠశాలలో పంద్రాగస్టు వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES