- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జై చంద్ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 79వ పంద్రాగస్టు వేడుకలలో విద్యార్థిని , విద్యార్థులకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, పాటల , పోటీలు, కోలాటాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు గ్రామంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు గ్రామ పెద్దల చేతుల మీదుగా ప్రధాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -