నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలో విధి నిర్వహణలో భాగంగా ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా ఉత్తమ సేవలందించినందుకు కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డికి ప్రశంసా పత్రం లభించింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికారులు ఎస్ఐ అనిల్ రెడ్డి సేవలను గుర్తిస్తూ ప్రశంస పత్రాన్ని అందజేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ నిరంజన్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చేతుల మీదుగా ఎస్ఐ అనిల్ రెడ్డి ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. జిల్లాస్థాయిలో స్థాయిలో ఎస్ఐ అనిల్ రెడ్డి ప్రశంస పత్రాన్ని పొందడం పట్ల మండల ప్రజలు, యువజన సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
కమ్మర్ పల్లి ఎస్ఐకి ప్రశంసా పత్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES