ఆకవరం మోహన్ రావు
నవతెలంగాణ – ఆలేర్ రూరల్
తమ ధన,మాన ప్రాణాలను త్యాగం చేసి భరత మాతను విముక్తం చేయడానికి రక్తార్పణం చేసిన అమరులను తలుచుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని ప్రేమ సేవా సధనం స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ ఆలేరు మాజీ సర్పంచ్ ఆకవరం మోహన్ రావు అన్నారు. శుక్రవారం శారాజీపేటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సబ్ స్టేషన్ ప్రక్కన హరిత హారం కార్యక్రమంలో భాగంగా వంద మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో బొందుగుల మాజీ సర్పంచ్ జూలుకుంట్ల రాంగోపాల్ రెడ్డి, మంత్రి దేవేందర్, శారాజీపేట మాజీ ఉపసర్పంచ్ కంతి మహేందర్, మొరిగాడి అశోక్, దూడం మధు, చెక్క పరశురామ్, చింతకింది వెంకటేశం, బోడ శ్రీకాంత్, ప్రేమ సేవా సధనం స్వచ్ఛంద సంస్థ సభ్యులు మహమ్మద్ ఖుర్షిద్ పాషా, మహమ్మద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
అమరుల ఆశయ సాధన కోసం కృషి చేయాలి
- Advertisement -
- Advertisement -