నవతెలంగాణ – పెద్దవంగర
మండల వ్యాప్తంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పార్టీ కార్యాలయాల్లో అధికారులు, ప్రత్యేకాధికారులు, ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు మువ్వన్నెల జెండా ఎగురవేశారు. తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ వీరగంటి మహేందర్, ఎంపీడీవో వేణుమాధవ్, ఎస్సై క్రాంతి కిరణ్, మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్, ఏపీఎం ఎండీ మహమూద్ పాషా, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, బీఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు కట్టోజు భాస్కరా చారి, కేజీబీవీ పాఠశాలలో ఎస్ఓ గంగారపు స్రవంతి, బీసీ సంక్షేమ వసతి గృహంలో వార్డెన్ అనపురం లింగన్న, ఎస్బీఐ బాంక్ మేనేజర్ అనిల్, ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు దేశభక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిందని, స్వాతంత్ర్యం తోనే అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని అభివర్ణించారు .
వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES