స్వాతంత్రం స్ఫూర్తి – రాజ్యాంగ రక్షణ దిశగా ఐక్య ఉద్యమం అవసరం
స్వాతంత్రం త్యాగాల ఫలితం – రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలంతా ఏక మవ్వాలి: మల్యాల గోవర్ధన్
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రం బహుజన్ కాలనీలోని బహుజన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్యాల గోవర్ధన్ జాతీయ జెండా ఆవిష్కరించి, జాతీయ గీతం పాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మన స్వాతంత్రం అనేది ఊరికే రాలేదు. అనేకమంది స్వాతంత్ర సమరయోధులు, విప్లవకారుల త్యాగాలు, ప్రాణ త్యాగాలతో మన దేశం ఈ స్వేచ్ఛను పొందింది.
గాంధీ, నెహ్రూ వంటి నాయకుల స్ఫూర్తితో కుల, మత, ప్రాంత, లింగ భేదాలు లేకుండా అందరూ ఏకమై బ్రిటిష్ వలస పాలనను తరిమికొట్టారు అని గుర్తుచేశారు.కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత విధానాలను తప్పుబడుతూ, దేశంలో మతసామరస్యాన్ని కాపాడక, మతం మరియు ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పౌరుల హక్కుగా భావించే ఓట్లను దొంగిలించడం ద్వారా భారత రాజ్యాంగాన్ని విఘాతం కలిగించే చర్యలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ప్రజలంతా ఏకమై, ఓట్ల దొంగలను అధికారంలో నుండి తొలగించే విధంగా పోరాటం చేయాలి అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్యారంగుల కృష్ణ, బహుజన్ ట్రస్ట్ సభ్యులు మారుతి, అనిల్, అలీ, మహబూబ్, శాదుల్ ఖాన్, సాహెబ్ రావు, రమ, సావిత్రి, రజియా తదితరులు పాల్గొన్నారు.
మతసామరస్యాన్ని కాపాడాలి ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES