Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుస్వాతంత్ర్య దినోత్సవం వేళ నిజామాబాద్ లో అద్భుత ఘట్టం

స్వాతంత్ర్య దినోత్సవం వేళ నిజామాబాద్ లో అద్భుత ఘట్టం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్
రాష్ట్రంలోనే తొలిసారిగా మానసిక దివ్యాంగులు ఇండిపెండెన్స్ డే రోజు ప్రభుత్వ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 75 మంది మానసిక వికలాంగులు ఒకేసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా అద్భుతంగా నృత్యం చేసి ప్రతిభ కనబరిచారు. నిజమాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఇందుకు వేదికగా నిలిచింది.. జై హో.. జై హో అంటూ సాగిన పాటపై మానసిక దివ్యాంగులు చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది.. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మానసిక దివ్యాంగుల ప్రదర్శన తిలకించారు.

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీసు కమిషనర్ సాయి చైతన్యలు సైతం ప్రదర్శనను చూసి మానసిక వికలాంగులను అభినందించారు. స్నేహా సొసైటీ కార్యదర్శి ఎస్.సిద్ధయ్య అందుల పాఠశాల ప్రిన్సిపల్ ఎస్.జ్యోతి మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరిలు కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చేతుల మీదుగా ప్రదర్శనకు గానూ సిద్ధయ్య జ్యోతిలు ప్రశంసా పత్రం , జ్ఞాపిక అందుకున్నారు. వాస్తవానికి వారు అందరిలాంటి వారు కాదు. మానసిక వికలాంగులు సమాజంలో చిన్న చూపునకు వివక్షకు గురవుతున్న వారు. అయినా స్నేహా సొసైటీ ఆధ్వర్యంలో అనేక నైపుణ్యాలు పొందు తున్నారు.

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా స్నేహా సొసైటీ ద్వారా వారి నృత్య కళా నైపుణ్యం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించే అవకాశం వచ్చింది. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఈ అవకాశం ఇప్పించి అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో మానసిక దివ్యాంగులు ప్రతిభను చూపించినందుకు స్నేహా సొసైటీ తరఫున సిద్ధయ్య జ్యోతిలు ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad