నవతెలంగాణ -రాయపోల్
విద్యార్థులు చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు నిర్మించుకోవచ్చని రాయపోల్ మండల బిజెపి మాజీ అధ్యక్షులు రాజాగారి రాజా గౌడ్ అన్నారు. శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వడ్డేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు గ్రామ ప్రజలకు 79 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో మహానీయులు దేశ స్వతంత్రం కోసం తమ ప్రాణాలను అర్పించారు. వారి ఆశయాలు సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ముందుకు వెళ్లాలన్నారు.
చదువుతోనే భవిష్యత్తు మారుతుందని తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందన్నారు.పాఠశాల విద్యార్థుల దాహార్తిని తీర్చి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి రూ.15 వేలు విలువగల వాటర్ ప్యూరిఫైయర్ అందజేయడం జరిగిందన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బృందం రాజా గౌడ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, ఏఏపీసి చైర్మన్ నర్సవ్వ, ఉపాధ్యాయులు రజిని, సుధాకర్, వరప్రసాద్, రాజయ్య, మోహన్, కరుణాకర్, ఇంద్రసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ బహుకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES