నవతెలంగాణ – పెద్దవూర
79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ అధికారుల అవార్డు మహోత్సవంలో భాగంగా పెద్దవూర మండల ఎంఈఓ తరి రాము శుక్రవారం ఉత్తమ అవార్డు అందుకున్నారు. పదవ తరగతి ఫలితాలలో పెద్దవూర మండలం 100 శాతం ఉత్తీర్ణత సాధించినదుకు గాను ఈ అవార్డును అందుకున్నారు. మండలం లోని దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు టై బెల్ట్ ఐడి కార్డ్ దాతల సహకారంతో ఇప్పించడండం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం పాఠశాలల్లో ఉపాధ్యాయులకు మోటివేషన్ మరియు విద్యార్థులకు నైతిక విలువలు తెలియచేయడం వంటి అంశాల పైఅధికారులు విద్యార్థుల పట్ల చూపుతున్న అభిమానం, పాఠశాల అభివృద్ధి అంశాలపై సుదీర్ఘాంగా పనిచేయటం వల్ల జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలుసుకొనిఉత్తమ అవార్డు బహుమతి ప్రధానం చేసినందుకు మండల ప్రజలకు ధన్యవాదములు తెలిపారు.
ఉత్తమ ఎంఈఓగా అవార్డు అందుకున్న తరి రాము
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES