బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ ‘కిష్కిందపురి’. సెప్టెంబర్ 12న విడుదలవుతున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం టీజర్ ఈరోజు విడుదలైంది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ మిస్టీరియస్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో అందర్నీ అలరిస్తోంది. మొదటి షాట్ నుంచే ఓ మిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఒక వింటేజ్ మాన్షన్‌లోకి వెళ్లిన ఓ అమ్మాయి ఒక్కసారిగా అదశ్యం అవుతుంది. ఇంతలో రేడియో నుంచి ఒక మెసేజ్ ప్రసారం చేస్తుంది. ఇది కథలో పారానార్మల్ ఎనర్జీతో పాటు డిఫరెంట్ టైమ్ లైన్స్‌ని ప్రజెంట్ చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటెన్స్ రోల్‌లో అదరగొట్టారు. అనుపమ పరమేశ్వరన్ ఆయన లవ్ ఇంటరెస్ట్‌గా కనిపించింది. టీజర్‌లో ఈ ఇద్దరి క్యారెక్టర్లను పరిచయం చేశారు. టెక్నికల్‌గా టీజర్ అద్భుతంగా ఉంది. చిన్మరు సలస్కర్ కెమెరా వర్క్ ఓ సస్పెన్స్, హర్రర్‌ని ఎలివేట్ చేసింది. చైతన్ భరద్వాజ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌ని మరో లెవల్‌కి తీసుకెళ్ళింది. ప్రొడక్షన్ డిజైనర్‌గా మనీషా ఏ దత్, ఆర్ట్ డైరెక్టర్‌గా డి. శివ కామేష్, నిరంజన్ దేవరమనే దితర్, క్రియేటివ్ హెడ్ జి. కనిష్క, కో-రైటర్‌గా దరహాస్ పాలకోలు వర్క్ చేస్తున్నారు. థ్రిల్ల్స్, ఎమోషన్స్, సూపర్‌న్యాచురల్ సస్పెన్స్‌తో ఉన్న టీజర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది అని చిత్ర యూనిట్ తెలిపింది.
‘కిష్కిందపురి’లో ఏం జరిగింది?
- Advertisement -
- Advertisement -