Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeసినిమాసరికొత్త ముక్కోణ ప్రేమకథ

సరికొత్త ముక్కోణ ప్రేమకథ

- Advertisement -

పార్వతి, దేవదాసుల ప్రేమకథకు ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే దీనికి భిన్నంగా ‘ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ టైటిల్‌తో ఓ విభిన్నమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మాహిష్మతి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై తోట రామకృష్ణ దర్శక, నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
సిద్దార్థ్‌ మీనన్‌, దిలీప్‌ హీరోలుగా, రాశి సింగ్‌ హీరోయిన్‌గా నటించారు. రఘుబాబు, కశిరెడ్డి రాజ్‌కుమార్‌, వీరశంకర్‌, గౌతం రాజు, రాకెట్‌ రాఘవ, గుండు సుదర్శన్‌, రవితేజ, రజిత ఇతర కీలక పాత్రలు పోషించారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది.
‘ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగు తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇదొక కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ. యువతను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. నేటి ట్రెండ్‌కి తగ్గట్టు ఇందులో పాటలు ఉన్నాయి. వీటిని చంద్రబోస్‌, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల వంటి ప్రముఖ గీత రచయితలు అద్భుతంగా రాశారు. ఈ పాటలన్ని ప్రేక్షకుల్ని బాగా అలరిస్తాయి’ అని రూపొందిస్తున్నట్టు దర్శక, నిర్మాత తోట రామకష్ణ తెలిపారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ : మోహిత్‌ రహమానియాక్‌, సినిమాటోగ్రాఫర్‌ : శ్రీనివాసరాజు, ఎడిటర్‌ : గన్‌, గీత రచయితలు : చంద్ర బోస్‌, సుద్దాల అశోక్‌ తేజ, భాస్కర భట్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : శరత్‌ వర్మ.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad