– బనకచర్లతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకూ నష్టం వాటిల్లదు
– ఏపీలో మహిళలకు ‘ఉచిత బస్సు’ ప్రారంభం
ఏపీ సీఎం చంద్రబాబు
విజయవాడ : 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌కు మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు తనకు అవకాశం కల్పించారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయజెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ”2019లో వచ్చిన ప్రభుత్వం ఐదేండ్ల పాటు రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది. ఏపీ బ్రాండ్‌ను నాశనం చేసింది. వ్యవస్థను నిర్వీర్యం చేసింది. దీంతో రాష్ట్రం 30 ఏండ్లు వెనక్కి పోయింది. రూ.10 లక్షల కోట్ల అప్పులు, బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు. పోలవరం నిలిచిపోయింది. అవరావతి ఆగిపోయింది. పెట్టుబడులు తరలిపోయాయి.
2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీయే నినాదాన్ని ప్రజలు నమ్మి చరిత్రాత్మక తీర్పునిచ్చారు. నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్ షేర్‌తో కూటమిని దీవించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం. మేం అధికారాన్ని చేపట్టిన ఏడాదిలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా పని చేశాం. తొలి సంతకం నుంచి సుపరిపాలన వైపు అడుగు వేశాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ప్రజల మద్దతు, మా సంకల్పం, దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం.అని చంద్రబాబు తెలిపారు.మెగా డీఎస్సీ నియామకాలను ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు.
బనకచర్లతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకూ నష్టం వాటిల్లదు
గోదావరి వృథా జలాలను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లించాలి. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వినియోగిస్తాం. బనకచర్లతో ఏ రాష్ట్ర నీటి ప్రయో జనాలకూ నష్టం వాటిల్లదు. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకాశం జిల్లాను కరవు నుంచి బయటపడేసే వెలుగొండకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. వచ్చే ఏడాది జులై నాటికి సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టు పనులు చేస్తున్నాం.అని చంద్రబాబు వివరించారు.
మనది డెడ్ ఎకానమీ కాదు.. గుడ్ ఎకానమీ
పారిశ్రామికవేత్తలకు నమ్మకాన్ని కలిగించాం. మనది డెడ్ ఎకానమీ కాదు.. గుడ్ ఎకానమీ అని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నాం.అని ఏపీ సీఎం పేర్కోన్నారు.
ఏపీలో మహిళలకు ‘ఉచిత బస్సు’.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఏపీలో మహిళలకు ఆర్టీసీలో ఉచితబస్సు ప్రయాణం పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి సీఎం విజయవాడకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులో మహిళలతో సీఎం మాట్లాడారు. అంతకుముందు ఉండవల్లి గుహల వద్దకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ మాట్లాడారు.
అభివృద్ధిలో ఆల్‌టైమ్ రికార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES