పరస్పరం కరచాలనం..
ఒకే కారులో సమావేశమందిరానికి దేశాధినేతలు
అలస్కా : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు భేటీ అయ్యారు. అమెరికాలోని అలాస్కా ప్రావిన్స్ రాజధాని యాంకరేజ్‌లో సమావేశ మవ్వటానికి వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ట్రంప్ సాద రంగా ఆహ్వానం పలికారు. ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసు కున్నారు. ఒకే కారులో సమావేశమందిరానికి చేరుకు న్నారు.రష్యా , ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై.. మూడేండ్లయింది. ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. రష్యా , ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోవాలని ట్రంప్ కోరుకుంటున్నారు.ఈ సమావేశం రష్యా , ఉక్రెయిన్‌లకు మాత్రమే కాకుండా, భారతదేశం, అమెరికా, రష్యా , ఉక్రెయిన్ అనే నాలుగు దేశాలకు కూడా ముఖ్యమైనది.ఈ సమావేశం విజయానికి తనకు కొలమానం ఏమిటి అని విలేకరులు అడిగినప్పుడు.. కాల్పుల విరమణ త్వరగా జరగాలని నేను కోరుకుంటున్నానని ట్రంప్ అన్నారు. ఇప్పుడు అది జరగకపోతే, నేను సంతోషంగా ఉండను. అమా యకుల ప్రాణనష్టం ఆపాలని నేను కోరుకుంటున్నాను. అంటూనే చర్చలు సానుకూలంగా లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక చేశారు.
అలస్కా వేదికగా ట్రంప్-పుతిన్ భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES