నవతెలంగాణ-చిన్నకోడూరు
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయకసాగర్ రిజర్వాయర్ వద్ద శనివారం విషాదఛాయలు అలుముకున్నాయి. రిజర్వాయర్‌ను చూడటానికి వరంగల్ నుంచి కుటుంబాలతో కలిసి వచ్చిన ఓ బాలిక, బాలుడు.. రిజర్వాయర్‌లో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన యాకుబ్ బాబా, యజాజి ఆలీ కుటుంబాలు హైదరాబాద్‌కు వెళ్తూ మార్గమధ్యలో ఉన్న రంగనాయక సాగర్‌ను చూడటానికి వచ్చారు. ఈ క్రమంలో రిజర్వాయర్‌లో ఈత కొడుతుండగా యాకుబ్ బాబా కూతురు మెహరాజ్ (13), యజాజి అలీ కొడుకు అర్బాజ్ (15) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసు, ఫైర్ సిబ్బంది గజ ఈతగాళ్ల సాయంతో వారి మృతదేహలను వెలికి తీశారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ మధు, జిల్లా ఫైర్ ఆఫీసర్ సదన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సెల్ఫీల కోసం ఎవరూ నీటిలోకి దిగొద్దని.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, తగు జాగ్రత్త తీసుకోవాలని కోరారు.
‘రంగనాయకసాగర్’లోఈతకు వెళ్లి ఇద్దరు మృతి
- Advertisement -
- Advertisement -