- Advertisement -
చెన్నై : జర్మనీ గ్రాండ్‌మాస్టర్, 20 ఏండ్ల విన్సెంట్ కీమర్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. అజేయ జోరుతో ఎత్తులు వేసిన విన్సెంట్ క్లాసికల్ ఫార్మాట్‌లో ఏడు పాయింట్లతో ఆకట్టుకున్నాడు. మాస్టర్స్ విభాగం ఆఖరు (9వ) రౌండ్లో అమెరికా జీఎం రే రాబ్సన్‌పై గెలుపుతో విన్సెంట్ విజేతగా నిలిచాడు. వరల్డ్ నం.5 అర్జున్ ఇరిగేశి, కార్తికేయ మురళీ, అనీశ్ గిరిలు ఐదు పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచారు. చాలెంజర్స్ విభాగంలో ఎం ప్రణేశ్ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో వచ్చే ఏడాది ప్రణేశ్ మాస్టర్స్ విభాగంలో పోటీపడేందుకు అర్హత సాధించాడు.
- Advertisement -