Sunday, May 4, 2025
- Advertisement -

– భార్య మృతి, చికిత్స పొందుతున్న భర్త
– రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలో ఘటన
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో భార్యాభర్తలు ఆత్మహత్యయత్నం చేయగా.. భార్య మృతిచెందింది. భర్త చికిత్స పొందుతున్న ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రబోడ ప్రాంతానికి చెందిన రమేశ్‌, రాజేశ్వరి(38) భార్యాభర్తలు. రమేశ్‌ స్థానికంగా లేబర్‌ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తలు అనారోగ్యం బారినపడటంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దాంతో మనస్తాపం చెందిన వారు ఇంట్లో బాత్‌రూమ్‌ కడిగే యాసిడ్‌ను శనివారం ఇద్దరూ తాగారు. గమనించిన స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రాజేశ్వరి కడుపులో పేగులు కాలిపోవడంతో ఆమె మృతిచెందింది. రమేష్‌ చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -