Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఅమరవీరులను అవమానపరిచిన ప్రధాని ప్రసంగం

అమరవీరులను అవమానపరిచిన ప్రధాని ప్రసంగం

- Advertisement -

– మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం
– గచ్చిబౌలి ఎస్‌వీకేలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ- మియాపూర్‌

ప్రధాని మోడీ ప్రసంగం స్వాతంత్య్ర అమరవీరులను అవమానపరిచిందని మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం గచ్చిబౌలిలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బాలసుబ్రహ్మణ్యం జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం సర్వ మతాలు, విభిన్న భాషల సమూహమని చెప్పారు. స్వాతంత్య్ర సంగ్రహంలో ఎంతో మంది వీరులు నెలకొరిగారని గుర్తు చేశారు. మహాత్మగాంధీ, భగత్‌సింగ్‌, నెహ్రు వంటి ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా దేశానికి స్వేచ్ఛ లభించిందన్నారు. కానీ నేడు కొంత మంది మతాలుగా విభజిస్తున్నారని, ఇలా చేయడం మతాల మధ్య కొట్లాటలు పెట్టడమేనని అన్నారు. సంప్రదాయబద్ధంగా ఎవరి స్వేచ్ఛ వారిదే అన్నారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎ.రాంచంద్రయ్య మాట్లాడుతూ.. దేశంలో మత విద్వేషాలు పెంచే విధంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. అందరికీ సమాన హక్కులు కల్పించాలన్నారు. ప్రపంచ దేశాలతో సోదరాభావంతో ఉండాలని సూచించారు. యువత సక్రమ మార్గంలో నడిచి, దేశ అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ సభ్యులు ఆర్‌.సాంబశివరావు మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యం, సోషలిజం పదాలను తీసివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వీకే బాధ్యులు విజరుకుమార్‌, లైబ్రరీ ఇన్‌చార్జి అనిల్‌, రవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad