మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా..
10వ వార్షికోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
నవతెలంగాణ- విలేకరులు
నవతెలంగాణ దినపత్రిక 10వ వార్షికోత్సవంతోపాటు 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రీజియన్ల పరిధిలో ముద్రించిన ప్రత్యేక సంచికలను శుక్రవారం ఆవిష్కరించారు. మెదక్ రీజియన్ పరిధిలో ముద్రించిన ప్రత్యేక సంచికను సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ప్రావీణ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నవతెలంగాణ వార్షికోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ మెదక్ రీజియన్ మేనేజర్ రేవంత్‌కుమార్, మెదక్ ప్రాంతీయ ప్రతినిధి మేకల కృష్ణ, సబ్ ఎడిటర్ దస్తగిరి, ఏడివిటి ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్, రిపోర్టర్లు మద్దూరు బాలరాజు, అనిల్, వీరేశం, నివాస్ పాల్గొన్నారు. అదే విధంగా మెదక్ జిల్లా కేంద్రంలో మంత్రి గడ్డం వివేక్ చేతుల మీదుగా స్పెషల్‌ను ఆవిష్కరించారు. మంత్రితోపాటు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్‌పీ శ్రీనివాస్‌రావు, అదనపు కలెక్టర్ నగేష్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ ఏడివిటి ఇన్‌చార్జి మల్లేశ్ కూడా ఉన్నారు.
కార్మిక, కర్షకుల పక్షపాతి నవతెలంగాణ : ఎమ్మెల్యే మామిడాల
కార్మిక, కర్షకుల పక్షపాతిగా నవతెలంగాణ పనిచేస్తోందని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నవతెలంగాణ వార్షికోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముద్రించిన ప్రత్యేక సంచికను ఎమ్మెల్యే, ఝాన్సీరెడ్డి, నవతెలంగాణ వరంగల్ రీజియన్ మేనేజర్ దేవేందర్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విలేకరులు, సిబ్బంది పాల్గొన్నారు. తొర్రూరు లోనూ టీపీసీసీ ఉపాధ్యక్షులు ఝాన్సీరెడ్డి ఆవిష్కరించారు.
భూపాలపల్లిలో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం నవతెలంగాణ 10వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను రాష్ట్ర షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మెన్ బెల్లయ్య నాయక్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి దయాసాగర్, భూపాలపల్లి రిపోర్టర్ ఎర్రం సతీష్, విలేకరులు తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి కలెక్టరేట్‌లో..
నవతెలంగాణ పత్రిక 10వ వార్షికోత్సవం, 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచికను రంగారెడ్డి కలెక్టరేట్‌లో కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎడీవీటీ జీఎం వెంకటేష్, రంగారెడ్డి రీజియన్ మేనేజర్ మహేందర్‌రెడ్డి, ప్రాంతీయ ప్రతినిధి సైదులు, విలేకరులు, సిబ్బంది పాల్గొన్నారు.
నవతెలంగాణ ప్రత్యేక సంచికల ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES