– ఆర్టీసీ బస్సు, ప్రయివేట్ బస్సు ఢకొీని 30 మందికి తీవ్ర గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
నవతెలంగాణ-మహేశ్వరం
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గేట్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు బస్సులు ఢకొీన్నాయి. ఈ ఘటనలో సుమారు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చెందిన కొందరు ప్రయివేటు బస్సులో సోమశిల గుడికి వెళ్లి తిరిగి హైదరాబాద్‌కి వస్తున్నారు. కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తోంది. తుమ్మలూరు గేట్ వద్ద ఈ రెండు బస్సులు ఢకొీన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరితోపాటు 30 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదం సమయంలో రెండు బస్సుల్లో సుమారు వంద మందికి పైగా ఉన్నారు. హైదరాబాద్-శ్రీశైలం హైవేపైన ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామయింది. సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తుమ్మలూరు వద్దఘోర రోడ్డు ప్రమాదం
- Advertisement -
- Advertisement -