Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంజాతీయోద్యమ వారసత్వాన్ని కొనసాగిద్దాం

జాతీయోద్యమ వారసత్వాన్ని కొనసాగిద్దాం

- Advertisement -

– స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఖర్గే, రాహుల్‌
న్యూఢిల్లీ :
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో లోక్‌భ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌, ఖర్గే దేశ పౌరులకు 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఇరువురూ ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ హక్కులైన సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత, జాతీయ సమైక్యతను సాధించుకోవడంలో జాతీయోద్యమ వారసత్వాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా ఖర్గే పౌరులను కోరారు.
లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ స్వాతంత్య్రం అనేది.. సత్యం, సమానత్వం, సోదరభావంపై ఆధారపడినా దేశాన్ని నిర్మించడానికి నిబద్ధత అని అన్నారు.” దేశ పౌరులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వేచ్ఛ.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ద్వారా సాధించబడింది. సత్యం, సమానత్వం, న్యాయం అనే పునాదిపై భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పం అందరి మనసుల్లోనూ నిండిపోయింది. ఈ విలువైన వారసత్వం యొక్క గర్వం, గౌరవాన్ని కాపాడటం మనందరి కర్తవ్యం అని రాహుల్‌ అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad