మండలంలో ఇందిరమ్మ ఇండ్లు, కన్నాపూర్ వాగు పరిశీలన
నవతెలంగాణ – రామారెడ్డి
పేదోడు ఇల్లు కట్టి గృహప్రవేశం చేసిన రోజే విజయం సాధించినట్లు అని ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు కల్వకుంట్ల మదన్మోహన్రావు అన్నారు. శనివారం మండలంలోని కన్నాపూర్, కన్నాపూర్ తాండ, పోసానిపేట్, ఉప్పల్వాయి గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల ను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. నేరుగా లబ్ధిదారులతో మాట్లాడుతూ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. లబ్ధిదారుల సమస్యలను వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.
గ్రామాల్లో ఇందిరమ్మ కాలనీలు ఏర్పాటు చేస్తామని, ఇటీవల గృహ నిర్మాణ శాఖ ఎమ్ డి గౌతమ్ ను కలిసి నియోజకవర్గానికి మరిన్ని ఇందిర ఇండ్లు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. కన్నాపూర్ లో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగును పరిశీలించారు. వాగుపై వంతెన నిర్మించాలని, వర్షాలు వచ్చినప్పుడు గ్రామస్తులకు రవాణా సౌకర్యం ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గీరెడ్డి మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు గొల్లపల్లి లక్ష్మా గౌడ్, ఏఎంసి డైరెక్టర్ రావుఫ్, సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శిలసాగర్, ఎంపీడీవో నాగేశ్వర్, ఏఈ సుచరిత, పంచాయతీ సెక్రెటరీ నరేష్, తదితరులు ఉన్నారు.
పేదోడి ఇంటి కళ సాకారమైన రోజే అసలైన విజయం: ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES