బహులాష్టమి సందర్భంగా ఆలయానికి జడ్జీలు, ఐపీఎస్లు
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని ఇసన్నపల్లి,(రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో బహుళ అష్టమి పురస్కరించుకొని శనివారం భైరవ హోమం నిర్వహించారు. స్వామివారిని మెదక్ ప్రధాన జిల్లా జడ్జి నీలిమ, చేవెళ్ల సీనియర్ సివిల్ జడ్జి దశరథ రామయ్య, కామారెడ్డి సీనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ సుర సుమలత, హైదరాబాద్ సిఐడి ఎస్పి రామ్ రెడ్డి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారికి స్వామివారి శాలువాతో సన్మానించి, స్వామివారి జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఈవో ప్రభు రామచంద్రం, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, సిబ్బంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకున్న ప్రముఖులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES