Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్దుర్భరమైన పరిస్థితిలో బస్టాండ్ ప్రాంగణం 

దుర్భరమైన పరిస్థితిలో బస్టాండ్ ప్రాంగణం 

- Advertisement -

నవతెలంగాణ – నవాబు పేట
నవాబు పేట మండల కేంద్రము లోని బస్టాండ్ ప్రాంగణం వద్ద దుర్భరమైన పరిస్థితి నెలకొంది అని స్థానికులు తెలిపారు. దీంతో అక్కడికి వెళ్లి చూడగా.. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. పక్కన ఉన్న మరుగుదొడ్లు అపరిశుభ్రంగా దర్శనం ఇస్తున్నాయి. చుట్టుపక్కల పిచ్చిమొక్కలు పెరిగి దుర్వాసన వెదజల్లుతూ దోమల బెడద ఎక్కువగా సంచరిస్తూ కనబడుతుంది. బస్టాండ్ నిర్మించి ముప్పై సంవత్సరాలు గడిచినా బస్సులు ఇక్కడ రావడానికి వెనకడుగు వేస్తున్నారని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాత్రమే తిరిగి వెలుతున్నారని ప్రయాణికులు ఇక్కడ రావడానికి వెనకడుగు వేస్తున్నారని తెలిపారు. బస్సులు ఇక్కడ మాత్రమే స్టాప్ పెట్టాలి అని, ఎక్కడ స్టాప్ లేకుండా ఉంటే ఎదావిధిగా ప్రయాణికులు ఇక్కడ రావడానికి మెగ్గుచూపుతారని అన్నారు.

ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని బస్టాండ్ ప్రాంగణం అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు. బస్సు డ్రైవర్ కండక్టర్ లకు కూడా ఇక్కడ వస్తే మౌళిక సదుపాయాలు లేవు అని, కనీసం ఆర్టీసీ సిబ్బందికి కూడా మౌళిక సదుపాయాలు లేకపోవడం దారుణం అని అన్నారు. బస్టాండ్ ప్రాంగణం అభివృద్ధికి సంబంధించిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రయాణికులకు సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల ఇక్కకు రావడానికి వెనకడుగు వేస్తున్నారని అంటున్నారు. ఎవరూ లేని సమయంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అని, జరగరానిది ఏమైనా జరిగితే బాధ్యులు ఎవరు అని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బస్టాండ్ ప్రాంగణం ఆధునీకరణకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు పోలీసు స్టేషన్ కు వచ్చిన కేసులకు సంబంధించి పంచాయతీలు అంతా ఇక్కడే మీటింగ్ పెట్టి సెటిల్మెంట్ లు జరుగుతున్నాయి అని, రోడ్డు సౌకర్యం కల్పించాలని వెంటనే ఈ సమస్య పరిష్కారం కోసం సంబంధించిన అధికారులు చొరవ తీసుకుని బస్టాండ్ ప్రాంగణం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad