Monday, May 5, 2025
Homeరాష్ట్రీయంరెండేండ్లలో 'దేవాదుల' పూర్తి

రెండేండ్లలో ‘దేవాదుల’ పూర్తి

- Advertisement -

– 6 లక్షల ఎకరాలకు సాగునీరు
– సమ్మక్క బ్యారేజీకి 44 టీఎంసీలు కేటాయింపు : నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
– పూడిక పనులు జూన్‌ 15లోపు పూర్తి చేయాలి : మంత్రి పొంగులేటి
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

రెండేండ్లలో దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం ఉమ్మడి వరంగల్‌ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస ్‌రెడ్డితో కలిసి దేవన్నపేట పంప్‌హౌజ్‌, ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ వద్ద పనులను పరిశీలించారు. అనం తరం హన్మకొండ జిల్లా కలెక్టరేట్‌లో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చ యంతో ఉందన్నారు. గత ప్రభుత్వం పదేండ్లలో రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా నామమా త్రపు ఆయకట్టును మాత్రమే పెంచగలిగింద న్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సుమారు 5-6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తు న్నామని తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ఇప్పటికే మూడుసార్లు వచ్చామని, దేవాదుల ప్రాజె క్టుకు సంబంధించి భూ సేకరణ, ఇతర సమస్యల న్నింటినీ పరిష్కరించి రెండేండ్లలో పరిష్కరించి ప్రాజెక్టును పూర్తిచేసి ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు యాదాద్రి జిల్లాకు సాగునీరందిస్తామ న్నారు. గతంలో సమ్మక్క బ్యారేజీకి గోదావరి నది జలాల కేటాయింపులు జరగలేదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాకే సమ్మక్క బ్యారేజీకి గోదావరి జలాలను 44 టీఎంసీల గోదావరి జలా లను కేటాయించినట్టు తెలిపారు. తద్వారా దేవా దుల ప్రాజెక్టు పరిధిలో తాగునీటికి సైతం ఈ జలాలను వినియోగించుకునే అవకాశం ఉంటుంద న్నారు. గతంలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి సమ్మక్క బ్యారేజీ కి ఎన్‌ఓసీ ఇవ్వలేదని, తాజాగా ఆ రాష్ట్ర ముఖ్య మంత్రితో మాట్లాడి అంగీకారం పొందామన్నారు. రాష్ట్రంలో యేటా 280 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నధాన్యం పండుతున్నదని, ఈ మేరకు 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఫిలిప్పీన్స్‌ దేశానికి ఎగుమతి చేయడానికి ఒప్పం దం చేసుకున్నట్టు తెలిపారు. ఆఫ్రికా దేశాలకు సైతం సన్న ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. 15 రోజులపాటు ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించాల్సిందిగా మంత్రి ఎమ్మెల్యేలను కోరారు.
‘భద్రకాళి’ పూడిక పనులు జూన్‌ 15లోపు పూర్తి చేయాలి : మంత్రి పొంగులేటి
భద్రకాళి చెరువు పూడిక పనులు జూన్‌ 15వ తేదీలోపు పూర్తి చేయాలని మంత్రి పొంగు లేటి శ్రీనివాస్‌రెడ్డి తెలి పారు. ఇప్పటికే 50 శాతం పనులు పూర్త య్యాయన్నారు. అసాధ్యమనుకున్న పను లను సాధ్యం చేయొచ్చని భద్రకాళి చెరువు పూడిక తీత పనులను చేయడం ద్వారా రోల్‌ మోడల్‌గా నిలిచారని వరంగల్‌, హనుమ కొండ జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల శాఖ, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులను మంత్రి అభినందించారు. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి డీఎస్‌ చౌహాన్‌, నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ సునీల్‌కుమార్‌, సీఈ అశోక్‌ కుమార్‌, విప్‌ రామ చంద్రునాయక్‌, మేయర్‌ గుండు సుధా రాణి, ఎమ్మెల్సీ బస్వరాజ్‌ సారయ్య, ఎమ్మెల్యే లు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌ రెడ్డి, కేఆర్‌ నాగరాజు, యశస్వినీరెడ్డి, మురళీ నాయక్‌, గండ్ర సత్యనారాయణ రావు, కుడా చైర్మెన్‌ ఇనుగాల వెంకట్రాం రెడ్డి, వరంగల్‌, హన్మకొండ జిల్లా కలెక్టర్లు సత్యశారద, పి. ప్రావీణ్య, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల కలెక్టర్లు రిజ్వాన్‌ బాషా, రాహుల్‌ శర్మ, అద్వైత్‌ కుమార్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -