Wednesday, October 1, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రమాదకరంగా మారిన కల్వర్టును పరిశీలించిన అధికారులు

ప్రమాదకరంగా మారిన కల్వర్టును పరిశీలించిన అధికారులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రం నుంచి ఉప్లూర్ గ్రామానికి వెళ్లే దారిలో వరద కాలువ దాటిన తర్వాత కుడివైపు ప్రమాదకరంగా ఉన్న కల్వర్టును శనివారం అధికారులు పరిశీలించారు. ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, తహసిల్దార్ గుడిమెల ప్రసాద్, రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ ఈఈ, పోలీస్ సిబ్బంది కల్వర్టు వద్ద  ఏర్పడ్డ గుంతల్ని పరిశీలించారు.భారీ వర్షాల మూలంగా  బీటీ రోడ్డు పక్కకు కోతకు గురై గుంతలు ఏర్పడిన కల్వర్టు వద్ద రాత్రి సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు పరిశీలన చేశారు. వర్షాల మూలంగా ఏర్పడ్డ భారీ గుంతలను యుద్ధప్రాతిపదికన పూర్తి వేయించాలని నిర్ణయించారు. గుంతల్ని పూడ్చే వరకు ప్రజలను అప్రమత్తం చేయడానికి తాత్కాలికంగా రాళ్లు పెట్టి, ఎర్ర రిబ్బిన్లను ఏర్పాటు చేశారు.పోలీస్ సిబ్బంది సమన్వయంతో కల్వర్టు వద్ద ప్రమాదాలు జరగకుండా  భారీకేడ్లను ఏర్పాటు చేశారు.  అధికారుల వెంట పంచాయతీ కార్యదర్శి గంగాజమున, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -