Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు చెన్నూరు, గూడూరు విద్యార్థుల ఎంపిక 

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు చెన్నూరు, గూడూరు విద్యార్థుల ఎంపిక 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు మండలంలోని చెన్నూరు, గూడూరు ఉన్నత పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు ఎంపికయ్యారు. శనివారం చెన్నూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పుస్కూరి రమేష్, గూడూరు ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ చిట్యాల యాదగిరి లు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 18, 19 తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు చెన్నూరు ఉన్నత పాఠశాల నుండి మొలుగూరి అఖిల, చిలివేరు రేవతి, అర్కల సాత్విక్, గూడూరు ఉన్నత పాఠశాలకు చెందిన భూక్య రాకేష్, కీర్తి శ్రీకళ ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థిని, విద్యార్థులను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అభినందించారు. జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad