Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా కృష్ణాష్టమి జయంతి వేడుకలు

ఘనంగా కృష్ణాష్టమి జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దేవరాంపల్లిలో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భముగా శ్రీ కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ఉట్టి కొట్టె కార్యక్రమం ప్రారంభించారు. చిన్నారులు కృష్ణుడి, గోపికల వేషాదారణతో పలువురిని ఆకట్టుకున్నారు. మాజీ సర్పంచ్ నవీన్ రావు, మాట్లాడుతూ… సంప్రదాయ పద్దతులను విద్యార్థులకు పరిచియం చేయడం వంటి విలువలను తెలపడం ప్రస్థుత పరిస్థితుల్లో ముఖ్యమని అన్నారు. పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు దాని తర్వాత శోభయాత్ర ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాటారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పిల్లమరి రమేష్ , కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ఓన్న వంశవర్ధన్ రావు, కొండపర్తి మురహరి,  కామిడి ప్రమోద్, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad