- Advertisement -
నవతెలంగాణ-హైదారాబాద్: ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ బీహార్ ఓట్ల చోరీపై జోడో యాత్ర తరహాలో ఓటర్ అధికార్ యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇండియా బ్లాక్ కూటమి పార్టీలతో కలిసి రేపు బీహార్‌లోని ససారాంలో ఈ యాత్రను రాహుల్ గాంధీ మొదలుపెట్టనున్నారు. యాత్రకు సంబందించి రూట్ మ్యాప్ ఖరారైంది.
రేపు బీహార్‌లోని ససారాంలో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. 16 రోజుల్లో 25 జిల్లాల్లో 1300 కిలోమీటర్లు యాత్ర రూట్ మ్యాప్‌ను ఇవాళ విడుదల చేశారు. ఇందులో భాగంగా ర్యాలీలు, సభలు, కార్యక్రమాలతో ప్రజల మధ్యకు రాహుల్ రానున్నారు. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ఓటర్ అధికార్ యాత్ర ముగియనుంది.

- Advertisement -