నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్నాపల్లి గ్రామానికి చెందిన నాగపురి పురేందర్ గౌడ్ (52) కాలు జారీ కింద పడి మృతి చెందినట్లు ఎస్ హెచ్ ఓ జి సందీప్ తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం.. సిర్నపల్లి గ్రామానికి చెందిన పురేందర్ గౌడ్ మండలంలోని గన్నారం గ్రామంలో లోని కల్లు దుకాణంలో కులీ పని చేస్తూ జీవిస్తున్నడు. ఆ పనిపై రోజు ఉదయం ఇంటి నుంచి బయలుదేరి నడుచుకుంటూ గన్నారం గ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో రోడ్డు పక్కన మూత్రానికి వెళ్లే సమయంలో కాలు జారీ బండపై పడ్డాడు. దీంతో ఆయన తలకు గాయమైంది. వర్షపు నీరుతో ఏర్పడిన చిన్న గుంటలో పడి లేవలేని స్థితిలో ఉండి ఊపిరాడక మృతి చెందినట్లు ఎస్ హెచ్ ఓ వివరించారు. మృతుని భార్య నాగపురి భాగ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మర్చూరికి తరలించినట్లు ఎస్ హెచ్ ఓ జి సందీప్ తెలిపారు.
ప్రమాదవశాత్తూ గుంటలో పడి వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES