నవతెలంగాణ – కామారెడ్డి
ఈనెల 19 మంగళవారం సీపీఐ(ఎం) అఖిలభారత మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి సంస్మరణ సభ కామారెడ్డి పట్టణంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో జరుగునుంది. ఈ సభకు ముఖ్యఅతిథిగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ హాజరవుతున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని పార్టీ కార్యకర్తలు, పార్టీ శాఖ కార్యదర్శులు, సభ్యులు, పార్టీ శ్రేణులు, రైతులు, కార్మికులు, విద్యార్థి యువజనులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.వెంకట్ రాములు హాజరవుతున్నారని తెలిపారు. సీతారాం ఏచూరి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు నాయకుడిగా కాకుండా ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలకు ఒక దిక్సూచి లాగా మార్గదర్శిలాగా పనిచేశాడని అన్నారు.
దేశం కోసం, దేశ ప్రజలు రైతాంగం, కార్మికుల కోసం ప్రపంచ కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా, సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలను నిర్మించిన వ్యక్తి అన్నారు. భారత పార్లమెంటులో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నాడని గుర్తుచేశారు. పార్లమెంటునను ఉద్దేశించి ఏచూరి చేసిన ప్రసంగం దేశ భవిష్యత్తుకు, యువతరానికి మార్గదర్శిలాగా పనిచేస్తుందని తెలిపారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఏచూరి కి నివాళులు అర్పించడం అంటే ఆయన చూపిన బాటలో ముందుకెళ్లడమేనని తెలిపారు.
ఎమర్జెన్సీ సమయంలో అరెస్టులకు భయపడకుండా ఇందిరా గాంధీ ఇంటి ముందు ధర్నా నిర్వహించి జేఎన్యూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేశాడన్నారు. అంతటి మహనీయుని మనం ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన బాటలో నడవాలని, 19న జరిగే కార్యక్రమాన్ని జిల్లాలోని రైతులు కార్మికులు యువజనులు అట్లాగే ఏచూరి గారి అభిమానులు ప్రతి ఒక్కరు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు వెంకట్ గౌడ్, మొతీరాం నాయక్, కొత్త నరసింహులు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏచూరి సంస్మరణ సభకు హాజరు కానున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES