Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్కులం పేరుతో దూషించిన ఇద్దరిపై కేసు..

కులం పేరుతో దూషించిన ఇద్దరిపై కేసు..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
కులం పేరుతో దూషించిన ఇద్దరు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన రామటంకి శ్రీనివాస్ కు జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామ శివారులో ఆయన భార్యపై 158/4 సర్వే నెంబర్ లో ఒక ఎకరం భూమి పట్టా కలిగి ఉన్నాడు. ఇట్టి భూమిని అదే గ్రామానికి చెందిన బాల్త రాజమౌళి, బాల్త భూమక్క లు వారికి తెలియకుండా ట్రాక్టర్ తో దున్నించినారని, కోర్టులో కేసులు కూడా నడిచాయని తెలిపారు. ఈనెల 13న రామ టెంకి శ్రీనివాస్ అతని తండ్రి వారి భూమి వద్ద నుండి తిరిగి వస్తుండగా బాల్క రాజమౌళి, భూమక్కలు వారి బంధువుల అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నాడని, అట్టి విషయాన్ని మనసులో పెట్టుకొని వారిద్దరిని కులం పేరుతో దూషించారు. అంతేకాక బూతులు తిట్టి మీకు ఇక్కడ భూమి లేదంటూ దూషించారని రామటంకి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad