Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంవచ్చే నెల 21న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల మహాగర్జన

వచ్చే నెల 21న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల మహాగర్జన

- Advertisement -

– ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిజర్వేషన్‌ ఫలాలను జీవో నెంబర్‌ రెండు ద్వారా ప్రభుత్వాలు లాక్కుంటున్నాయని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) విమర్శించాయి. వచ్చేనెల 21న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయుల మహాగర్జన నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. శనివారం హైదరాబాద్‌లో టీజీటీటీఎఫ్‌ అధ్యక్షులు ఇస్లావత్‌ లక్ష్మణ్‌నాయక్‌ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రామచందర్‌ (తెగ), ఎన్‌ యాదగిరి (బీటీఎఫ్‌), కొంగల వెంకట్‌ (ఎస్సీ,ఎస్టీయూఎస్‌), చైతన్య కల్పదర్శి (బీటీఎఫ్‌), బి గోవింద్‌ నాయక్‌ (జీటీఎస్‌), ఎస్‌ హరికిషన్‌ (టీటీఏ), బాబూరావు (ఎస్సీ,ఎస్టీ డాక్టర్‌ అసోసియేషన్‌), మేడీ రమేష్‌ (ఎస్సీ,ఎస్టీ విద్యుత్‌ శాఖ), తులసీదాస్‌ గైక్వాడ్‌ (ఎస్సీ,ఎస్టీ సెక్రటేరియట్‌ యూనియన్‌), నరసింహ (ఆయుష్‌), బబిత కుమారి (పీటీఏ), తులసి రామ్‌ రాథోడ్‌ (టీబేస్‌), తిరుపతిరావు (పబ్లిక్‌ అండ్‌ హెల్త్‌ ఎస్సీ ఎస్టీ యూనియన్‌), అనసూయ (ఎస్సీ ఎస్టీ హెల్త్‌ అండ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌).
రోహిత్‌ (హార్టికల్చర్‌ డిపార్ట్మెంట్‌) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయుల పదోన్నతుల్లో అడెక్వసీ లెక్కింపులో తీవ్ర అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు. జనరల్‌ రోస్టర్‌లో ఉద్యోగం పొందిన ఎస్సీ, ఎస్టీలను రిజర్వేషన్‌ కింద లెక్కించకూడదని వివరించారు. కానీ జీవో నెంబర్‌ రెండు ద్వారా జనరల్‌ రోస్టర్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయులను రిజర్వేషన్‌ రోస్టర్‌లో లెక్కించి రెండు దశబ్దాలుగా పదోన్నతులు రాకుండా ప్రభుత్వాలు మోసం చేస్తూ వస్తున్నాయని ఆరోపించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad