రిటైర్డ్ మాజీ కల్నల్ జక్కుల శ్రీనివాస్ యాదవ్
తంగళ్ళపల్లి చేరుకున్న కలిశాయాత్ర
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
భారతదేశవ్యాప్తంగా యాదవులకు రెస్జిమెంట్ను ఏర్పాటు చేయాలని రిటైర్డ్ మాజీ కల్నల్ జక్కుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. యాదవుల అభ్యున్నతి కోసం అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిజంగ్ల రజ్ కలిశ యాత్ర లో భాగంగా ఆదివారం తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ కలిసయాత్రను మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అహిర్ రెజిమెంట్ పునస్థాపన కోసం యాదవులు అహర్నిశలు పోరాటాలు చేస్తున్నామన్నారు. ఆర్మీలో యాదవ ఆర్మీ జవాన్లు దేశభక్తి,సౌర్యం, త్యాగం, అనే విలువలను ప్రతిబింబిస్తున్నారు.యువతలో దేశ సేవ స్ఫూర్తిని నింపుతుందన్నారు. యుద్ధాల్లో యాదవులు ధైర్య సాహసాలు ప్రదర్శించి తమ దేశభక్తిని చాటుకున్నారన్నారు.
రజాంగ్లా కలుష యాత్ర తెలంగాణలో గౌరవ పథం అన్నారు. తెలంగాణ ప్రజల గౌరవాన్ని ప్రతిబింబించే ఈ యాత్ర కర్ణాటక రాష్ట్రం లో ఆగస్టు 9వ తేదీన ప్రారంభమైందన్నారు. యుద్ధంలో ఎంతోమంది యాదవ ఆర్మీ జవాన్లు అసువులు బాసారని వివరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు ఏటి యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆసరి బాలరాజు, కార్యదర్శి మిరాల శ్రీనివాస్ యాదవ్, మండల అధ్యక్షులు మాసం భాస్కర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గంధం సంపత్ యాదవ్, మాజీ మండల అధ్యక్షులు గోగు మల్లేష్ యాదవ్, కవాటి మల్లేష్, శ్రీనివాస్,అంజయ్య, సాయి ప్రసాద్, గంగాధర్ గోపాల్, తిరుపతి, కిషన్,హరీష్, సత్తయ్య పాల్గొన్నారు.
యాదవుల రెజిమెంట్ ఏర్పాటు చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES