ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
గోలనుకొండలో పాపన్న విగ్రహం ఆవిష్కరణ
రాబోయే ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
బహుజనులకు రాజ్యాధికారం కోసం 300 సంవత్సరాల క్రితమే యుద్ధం చేసి అధికారం చేపట్టిన సర్దార్ సర్వయ పాపన్న చరిత్ర సృష్టించారు. అంటూ ప్రభుత్వ విప్ బిర్లా కొనియాడారు. ఆలేరు మండలం గొలనుకొండ గ్రామంలో ఆదివారం నాడు చరిత్ర మనకు మర్చిపోకుండా సర్వయ పాపన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఉన్నప్పుడే బహుజనులకు ఆర్థికంగా సామాజికంగా న్యాయం జరుగుతుందన్నారు.
సర్వేపల్లి గీత కార్మికుల కుటుంబంలో పుట్టినప్పటికీ చాకలి మంగలి కుమ్మరి దూదేకుల లాంటిఅన్ని కులాలను ఏకం చేసి రాజులకు భూస్వాములకు దొరల గుండెల్లో నిద్రపోయారు.
అన్ని గ్రామాలలో ఆగస్టు 18న సర్వే పాపన్న జయంతి రోజున ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. గోలను కొండ గ్రామంలో విగ్రహావిష్కరణ అనంతరం పెద్ద ఎత్తున బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ఈ రసారపు యాదగిరి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విమల వెంకటేష్ ఎంపీపీ చీర శ్రీశైలం గంధ మల్ల అశోక్ తూర్పు గూడ మాజీ సర్పంచ్ దూపడి వెంకటేష్ ఎంపీటీసీ ఆర్ ప్రశాంత్ గుండ్లగూడ మాజీ సర్పంచ్ ఆంజనేయులు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.