నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని సావర్గావ్ గ్రామంలో ఇందిరమ్మ పథకంలో గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారుల ఇండ్లను జుక్కల్ ఎంపిడిఓ శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ .. గ్రామంలో ఇందిరమ్మ పథకంలో మంజూరైన గృహాలను ఇప్పటికే మార్కౌట్ చేశామని అన్నారు. అదేవిధంగా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాల పనులు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పనులు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
వెను వెంటనే లబ్ధిదారుల వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో గ్రీన్ ఛానల్ ద్వారా డబ్బులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, గ్రామపంచాయతీ కార్యదర్శి, గృహ నిర్మాణ లబ్ధిదారులు , గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
సావర్గావ్ లో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES