Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుకౌలాస్ నాళా ప్రాజెక్ట్ ను స్థితిగతులను పరిశీలించిన ఎంపీడీఓ 

కౌలాస్ నాళా ప్రాజెక్ట్ ను స్థితిగతులను పరిశీలించిన ఎంపీడీఓ 

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని మధ్యతర ప్రాజెక్టు అయినా కౌలాస్ నాళా ప్రాజెక్ట్ ను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో చేరిన వరద నీరు వివరాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు పడుతున్న పొలంలో ప్రాజెక్టు వద్ద సంబంధిత అధికారులు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అధికారులకు సూచించారు. భారీ వర్షాలు పడుతున్న క్రమంలో ప్రాజెక్టులోకి 14వందల 12  క్యూసెక్కుల ఇన్ ప్లో మాత్రమే వచ్చిందని , ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం ఆదివారం ఉదయం నాటికి వచ్చిందని అధికారులు తెలిపారు.

పూర్తిస్థాయి నీటిమట్టం 458  మీటర్లు ఉందని , ప్రస్తుతము 456.80 మీటర్లు నీటి నిలువ ఉందని, ప్రాజెక్టు కెపాసిటీ 1.237 క్యూసెక్కులు ఉన్నాయని వెల్లడించారు. అవుట్ ఫ్లో కెనాల్, ఫ్లడ్గట్స్ నిల్ గా ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఈ కౌలాస్ నాళా ప్రాజెక్ట్ పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ తో పాటు, గ్రామ కార్యదర్శి, ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad