తక్షణ సహాయం కింద రూ.25 వేలు ఇవ్వాలి
ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఇండ్లల్లో నీరు చేరి ఆర్థికంగా నష్టపోయిన రణదీవెనగర్ బాధిత కుటుంబాలను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ నేతృత్వంలో పార్టీ నాయకత్వ బృందం ఆదివారం పరామర్శించింది. బాధితులైన షేక్ షబానా షేక్ రిహాన, పవర్ ఉషా షేక్ పర్వీన్, సుశీల, సరస్వతీ పర్వీన్ బాను, లలిత నిర్గుణ, త్రివేణి, మీరు, తదితర కుటుంబాలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ.. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదల ఇండ్లు నీళ్ళల్లో మునిగిపోయాయన్నారు.
బియ్యం, పప్పులు, తిండిగింజలతో పాటు బట్టలు ఇతర వస్తువులు కొట్టుకుపోయాన్నారు. తక్షణ సహాయం కింద వెంటనే కుటుంబానికి రూ.25వేల ఆర్థిక సహాయం అందించాలన్నారు. బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తాటిగూడ, గాంధీనగర్, సంజయ్ నగర్, సుభాష్ నగర్ తదితర వార్డుల్లో ఇదే రకమైన పరిస్థితి ఉందన్నారు. వారందరిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఆర్.మంజుల, ఆర్.సురేందర్, ఎం.గంగన్న, పట్టణ నాయకులు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి, పట్టణ నాయకులు లంక జమున, కోవే శకుంతల, గంగాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
వరద బాధిత కుటుంబాలను పరామర్శించిన సీపీఐ(ఎం) బృందం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES