నవతెలంగాణ – జుక్కల్
సాహిత్యరత్న లోక షాహీర్ అన్నా భావు సాఠే 105వ జయంతి సందర్భంగా జుక్కల్ మండలంలోని హంగర్గ గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన అన్నా భావు సాఠే విగ్రహావిష్కరణ వేడుక లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కు హాజరైన ఎమ్మెల్యే చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకుముందు ఎమ్మెల్యేను గ్రామ పొలిమేరల నుండి డప్పు వాయిద్యాలతో ఆహ్వానం పలుకుతూ ఊరేగింపుగా ఆహ్వానించారు. గ్రామంలో పలువురు గ్రామస్తులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఎమ్మెల్యేకు జ్ఞాపికలను అందజేశారు.
ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ లోక్ షాహీర్ అన్న బాహు సాఠే జీవిత చరిత్ర ను ప్రసంగంలో ప్రజలకు వివరించారు. గొప్ప సామాజిక వెత్త అని కొని యాడారు. గొప్ప మహానుభావులు పుట్టిన దేశమని అందుకే మనమందరం సుఖశాంతులతో జీవించగలుగుతున్నామని వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమం అనంతరం మహిళా సోదరీమణులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి హారతి ఇచ్చి మిఠాయి తినిపించి అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు, సామాజికవేత్తలు, దళిత నాయకులు, సోదర , సోదరీమణులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
అన్నా భావు సాఠే విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES