కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్
నవతెలంగాణ – గోవిందరావుపేట
రేపు జిల్లాలోని ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో పర్యాటక కార్యాలయ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని కార్యకర్తలు అభిమానులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం అశోక్ మీడియాతో మాట్లాడుతూ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా, శిశు సంక్షేమ శాఖ మాత్యులు సీతక్క తో పాటు పర్యాటక శాఖ రాష్ట్ర చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి లు పాల్గొంటున్నారని అన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని సకాలంలో కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి చేరుకొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
పర్యాటక రంగ కార్యాలయ శంకుస్థాపన మహోత్సవమును జయప్రదం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES