Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుAPSDMA:రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం..

APSDMA:రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమమధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న అల్పపీడనం, మంగళవారం మధ్యాహ్నానికి ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఏపీఎస్డీఎంఏ స్పష్టం చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad