– ఉట్టిని కొట్టేందుకు పోటీ పడ్డ యువకులు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమ్మర్ పల్లి, ఉప్లూర్, కోన సముందర్ గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టేందుకు యువకులు పోటీపడ్డారు. ఉట్టిని కొట్టే కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యువకులు ఉట్టి కొట్టేందుకు పోటీ పడుతున్నప్పుడు ప్రజలు వారిని అడ్డుకునేందుకు నీటి చిమ్మారు. ఉట్టిని కొట్టే కార్యక్రమం గ్రామస్తుల ఆనందోత్సవాల మధ్య కన్నుల పండుగగా సాగింది. అంతకు ముందు ఉట్టి కట్టే వద్ద గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో కమ్మర్ పల్లిలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు భోగ రామస్వామి, సభ్యులు నూకల బుచ్చి మల్లయ్య, గణేష్, ఆయా గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
మండలంలో పలు గ్రామాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES